మణుగూరు స్టేషన్‌ను పరిశీలించిన రైల్వే డీఆర్ఎం

20-11-2026 | 06:11pm

గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రాచలం రోడ్ రైల్వే అభివృద్ధి పనులపై సమీక్ష

మణుగూరు, నవంబర్ 20 (విజయక్రాంతి): రాబోయే గోదావరి పుష్కరాలను(Godavari Pushkarala) దృష్టిలో ఉంచుకుని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్(Bhadrachalam Road Railway Station) పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్(Secunderabad South Central Railway Divisional) మేనేజర్ గోపాలకృష్ణన్(Gopalakrishnan) శుక్రువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మణుగూరు రైల్వే స్టేషన్(Manuguru Railway Station) ప్రాంతాన్ని సందర్శించి రైల్వే ట్రాక్‌లు, క్రాసింగ్ లైన్లను(railway tracks and crossing lines) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైల్వే పరిధిలోని భూముల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాబోయే పుష్కరాల సమయంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై(Development of Railway Infrastructure) ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రైళ్ల వేగం పెంపు, రైళ్ల రద్దీ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు గోపాలకృష్ణన్ వెల్లడించారు. పుష్కరాల సమయంలో ప్రయాణికులకు మెరుగైన రైల్వే సేవలు అందించే దిశగా అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు