ఎమ్మెల్యేను కలిసిన డిసిసి మహిళా అధ్యక్షురాలు

20-11-2026 | 06:04pm

ఖానాపూర్ ( విజయక్రాంతి) ; నిర్మల్ జిల్లా(Nirmal District) నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా(President of the Mahila Congress) నియమితులైన మేడారం అపర్ణ ప్రదీప్(Medaram Aparna Pradeep) గారు నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel)ను మర్యాదపూర్వకంగా కలిసి  శాలువాతో, బొకే తో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి, మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందని జిల్లాలో మీ నాయకత్వంలో  కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మహిళా అధ్యక్షురాలు అపర్ణ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడారం ప్రదీప్, కోటగిరి శ్రీధర్ కార్యకర్తలు ఉన్నారు

మరిన్ని వార్తలు