బొల్లారంలో వ్యక్తి అదృశ్యం
20-11-2026 | 06:06pm
జిన్నారం, నవంబర్ 20 : బొల్లారం సర్వీస్ రోడ్డు(Bollaram Service Road) వద్ద మైత్రి కనెక్షన్లో మేస్త్రీ పని చేస్తున్న బహుదూరయ్య(Bahudoorayya) (45) అదృశ్యమయ్యాడు. స్వస్థలం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా(Prakasam District, Andhra Pradesh), దర్శి మండలం, పోలేపల్లి గ్రామం. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు టీ తాగి వస్తానని వెళ్లి తిరిగిరాలేదు. ఆనవాళ్లు చామనఛాయ రంగు, మీసాలు ఉంటాయి. తెల్ల షర్టు, ప్యాంటు ధరించి ఉన్నాడు.ఆచూకీ తెలిసిన వారు వెంటనే ఐ డీ ఏ బొల్లారం పోలీస్ స్టేషన్: 8712661841, 8712656729 కు సమాచారం ఇవ్వగలరు.