రైతుల హక్కులు, వ్యవసాయ చట్టాలపై అవగాహన
సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్
చొప్పదండి అక్టోబర్ 16 (విజయ క్రాంతి): రైతులకు వ్యవసాయ చట్టాలు(Agricultural Laws), వారి హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై(government welfare schemes) అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం చొప్పదండి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశ మందిరంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ యశ్వంత్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు తమ హక్కులు, వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని యశ్వంత్ సింగ్ సూచించారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలపై సరైన సమయంలో న్యాయ సలహాలు పొందాలని, అందుబాటులో ఉన్న న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని పేర్కొంటూ, న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పొందగల సహాయంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్యానెల్ న్యాయవాదులు రైతులకు సంబంధించిన వివిధ చట్టాలు, భూమి మరియు ఆస్తి వివాదాలు, వ్యవసాయానికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, రైతుల హక్కులు, న్యాయ పరిష్కార మార్గాలపై వివరించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అర్హతలు, సంబంధిత శాఖలను సంప్రదించే విధానాలపై అవగాహన కల్పించారు.
భూమి సంబంధిత సమస్యలు, శాంతిభద్రతలు, రైతులకు అందించే వ్యవసాయ సేవలు, ప్రభుత్వ పథకాలు, సహకార సంఘాల ద్వారా కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు చట్టపరమైన సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడంతోపాటు, అవసరమైనప్పుడు సంబంధిత శాఖల అధికారులను సంప్రదించి తమ సమస్యలకు పరిష్కారం పొందాలని ఈ సందర్భంగా సూచించారు.
న్యాయ సేవలను గ్రామీణ ప్రజలకు చేరువ చేయడం, రైతుల హక్కులను పరిరక్షించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పేర్కొంది. కార్యక్రమం అనంతరం రైతులకు సంబంధించిన వినతులను ప్యానెల్ న్యాయవాదులు స్వీకరించారు వాటి పరిష్కారానికి మార్గాన్ని చూపారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి, ఆర్నకొండ సింగిల్ విండో చైర్మన్ లు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి,
మనోహర్, సి.ఇ.ఓ తిరుపతి రెడ్డి, మునిసిపల్ ఛైర్పర్సన్ సరిత, డిప్యూటీ తహసీల్దార్ , SI రాజ్ కుమార్, ఎంపిడో వేణు గోపాల్ రావు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రియదర్శిని, చత్రునాయక్, అంజిత్ కుమార్, ప్యానల్ న్యాయవాదులు, చంద్ర ప్రకాష్ రెడ్డి, కిరణ్ కుమార్, రంగయ్య, రామాంజనేయులు, యస్.వి.ఆర్. కృష్ణ, నాజిమా సుల్తానా, మనోహర్ పటేల్, అరుణ్ కుమార్, లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు కూలీలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు