జీసీసీఎంఎల్ఎస్ పాయింట్‌ను పరిశీలించిన తాసిల్దార్ మద్దినేని మురళి

20-11-2026 | 02:37pm

దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జిసిసి బియ్యం సరఫరా కేంద్రాన్ని(GCC Rice Supply Center) దమ్మపేట తాహసిల్దార్ (యు/టి డిప్యూటీ కలెక్టర్) మద్దినేని మురళి ఆకస్మిక తనిఖీ గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా గోడౌ లోని బియ్యం నిల్వలతో పాటు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌ సిబ్బందితో మాట్లాడుతూ... నిరు పేదలకు అందించే బియ్యం సరఫరా విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగవద్దని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని తూనికలు, కొలతల విషయంలో జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. గోడౌన్ రికార్డులను పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డిప్యూటీ తాసిల్దార్ బద్రు, గోడౌన్ ఇన్చార్జి కొయ్యల పాంచాలి, గోడౌన్ సిబ్బంది దండు శ్రీనివాసరావు, రొయ్యల ప్రసాద్ హమాలీలు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు