దోమకొండలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

18-10-2026 | 04:24pm

దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన చాముండేశ్వరి మాత

ఆలయానికి రూ.40,348 విరాళాలు.. దాతలకు సన్మానం

దోమకొండ, అక్టోబర్ 18 (విజయక్రాంతి): దోమకొండ మండల(Domakonda Mandal) కేంద్రంలోని  శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో(Sri Chamundeswari Devi Temple) శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారిని శ్రీ దుర్గాదేవి అలంకారంలో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహించారు.

లోకకల్యాణం, మండల ప్రజల సుఖసంతోషాలను కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చండీ హోమం, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దోమకొండతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

ఆలయానికి రూ.40,348 విరాళాలు

శ్రీ చాముండేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు భక్తులు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా కామినేని శోభన–అనిల్ దంపతులు రూ.25,116/-, పటోల మౌనిక–కృష్ణారెడ్డి దంపతులు రూ.5,116/-, దోమకొండ కల్లు డిపో మేనేజ్‌మెంట్ రూ.10,116 /-విరాళంగా సమర్పించారు. మొత్తం రూ.40,348 విరాళాలు అందజేశారు.

విరాళాలు అందించిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. భక్తుల సహకారంతో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి శరత్ చంద్ర తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పెద్దారెడ్డి సిద్ధారెడ్డి, పూజారి శరత్ చంద్ర శర్మ, ధర్మకర్తలు ఎలం, రమేష్, బాలరాజు, వెంకటేశంతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు