కులం పేరుతో దాడి: కఠిన చర్యలు తీసుకోవాలి
నాగిరెడ్డిపేట్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మండలంలోని లింగంపల్లి గ్రామానికి(Lingampalli Village) చెందిన బంధముల నరేష్ పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ,ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్(SC/ST Journalists Association) కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుంటోళ్ళ యాదయ్య నాగిరెడ్డిపేట మండల ఎంఆర్పిఎస్ నాయకులు(MRPS leaders) తొంట సాయిలు,మండల ఉపాధ్యక్షులు యాదగిరి, నాగరాజుతో పాటు నాయకులు డిమాండ్ చేశారు.
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుతో(SC/ST Atrocity Case) పాటు హత్యాయత్నం కేసు సైతం నమోదు చేయాలన్నారు.ప్రభుత్వం, అధికారులు, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇంకా కొన్ని గ్రామాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని కేసును నీరుగార్చే యత్నం చేస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని,పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బంధముల నరేష్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అతనికి ఎమ్మార్పీఎస్ పూర్తిగా అండగా ఉంటుందనన్నారు.దళితులపై దాడులు పాల్పడే వ్యక్తులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని త్వరలోనే ఉన్నతాధికారులకు కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.అవసరమైతే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.