సామాజిక కార్యక్రమాలకు సహకారం అందిస్తా: ఎమ్మెల్యే
18-10-2026 | 04:21pm
బోథ్ అక్టోబర్ 18 (విజయక్రాంతి): సామాజిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadav Anil) పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని దన్నూరు గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన పద్మశాలి సంఘం భవన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న షెడ్డును పద్మశాలి కుల సహోదరులు షెడ్డు పూర్తి అయిన తర్వాత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.