బైండోవర్ నిబంధనలు ఉల్లంఘన
రూ.30 వేల బాండ్ వసూలు
ఇల్లెందు టౌన్, అక్టోబర్ 16, (విజయక్రాంతి): మండలం ఒడ్డుగూడెం గ్రామానికి(Oddugudem village) చెందిన ఇస్లావత్ జ్యోతి(Islavath Jyothi) గతంలో గుడుంబా కేసులో బైండోవర్ అయ్యి, నిబంధనలు ఉల్లంఘించడంతో రూ.30 వేల బాండ్ మొత్తాన్ని వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేసినట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. ఇల్లెందు ఎక్సైజ్ సర్కిల్(Yellandu Excise Circle) పరిధిలో అక్రమ గుడుంబా తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైండోవర్ నిబంధనలు(Bind-over conditions) ఉల్లంఘిస్తే బాండ్ మొత్తం వసూలు చేయడంతో పాటు పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ గుడుంబా కార్యకలాపాలపై సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.