కంపెనీ స్థాయి వాలీబాల్ పోటీల విజేతలకు బహుమతులు
ఇల్లెందు టౌన్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): వాలీబాల్ క్రీడలు(Volleyball sports) శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వాన్ని పెంపొందిస్తాయని సింగరేణి ఇల్లందు ఏరియా జీఎం వి. కృష్ణయ్య అన్నారు. వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇల్లందులోని వైసీఓఏ క్లబ్లో నిర్వహించిన కంపెనీ స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. రాబోయే కోల్ ఇండియా స్థాయి పోటీల్లో సింగరేణి క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి కంపెనీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ నిరంతరం సాధన చేయాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో డీజీఎం అజ్మీర తుకారాం, కార్మిక సంఘాల ప్రతినిధులు, క్రీడా నిర్వాహకులు, రిఫరీలు, ఆరు రీజియన్ల క్రీడాకారులు పాల్గొన్నారు.