విద్యార్థుల ర్యాలీలు

28-10-2026 | 06:41pm

ఖానాపూర్ ( విజయ్ క్రాంతి): నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ(Nasha Mukt Bharat Abhiyan Rally) నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా, బుధవారం జిల్లా వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఖానాపూర్ పట్టణంతో పాటు బైంసా నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలు మరియు ఇతర మత్తు పదార్థాల దుర్వినియోగం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించినట్టు ప్రిన్సిపల్ సుధాకర్, అధ్యాపకులు రజిత తెలిపారు.

మరిన్ని వార్తలు