తెలంగాణలో IASల బదిలీ
కీలక శాఖలకు కొత్త అధికారులు.. పూర్తి వివరాలు
హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. పలువురు సీనియర్ IAS అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం Government Orders జారీ చేసింది. వివిధ శాఖల పనితీరును మరింత సమర్థంగా నిర్వహించడం, Administrative Coordinationను బలోపేతం చేసే దిశగా ఈ పోస్టింగులు చేపట్టినట్లు ఉత్తర్వుల ద్వారా వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, జయేష్ రంజన్‌కు పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల Special Chief Secretary బాధ్యతలు అప్పగించారు. వికాస్ రాజ్‌ను ఇంధన శాఖ Special Chief Secretaryగా నియమించారు. నవీన్ మిట్టల్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల బాధ్యతలు కేటాయించారు. రెవెన్యూ (దేవాదాయ) శాఖకు శైలజ రామయ్యర్‌ను, క్రీడలు మరియు వారసత్వ శాఖకు ఎ. వాణి ప్రసాద్‌ను బదిలీ చేశారు. రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ Additional Charge అప్పగించారు.
రవాణా శాఖ కార్యదర్శిగా కె. ఇలంబర్తి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ముషారఫ్ అలీ ఫరూఖీ నియమితులయ్యారు. GHMCతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల అదనపు బాధ్యతలను సర్ఫరాజ్ అహ్మద్‌కు కేటాయించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ బాధ్యతలు శ్రుతి ఓఝాకు అప్పగించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ Directorగా డాక్టర్ సంగీత సత్యనారాయణ బాధ్యతలు చేపట్టనున్నారు. టీజీఎస్పీడీసీఎల్, టీజీరెడ్కో బాధ్యతలను జితేష్ వి. పాటిల్‌కు కేటాయించారు. ఈ మార్పులతో కీలక శాఖల్లో కొత్త అధికారుల ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగనుంది.