తిరిగొచ్చిన అధ్యాపకుడికి ఘన సన్మానం

28-09-2026 | 09:55pm

సింగరేణి,(విజయక్రాంతి): జపాన్ దేశం(Japan)లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఎక్స్‌పోజర్‌ కార్యక్రమం(Education Exposure Program)లో పాల్గొని తిరిగి వచ్చిన కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు దుర్గాప్రసాద్‌కు కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జపాన్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పోజర్‌కు దుర్గాప్రసాద్‌ను ఎంపిక చేసి పంపిన నేపథ్యంలో, కళాశాల ప్రిన్సిపల్ విజయకుమారి అధ్యక్షతన అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానాచార్యులు కేఎస్ రామారావు, వాసిరెడ్డి శ్రీనివాస్, ఏన్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) ప్రిన్సిపల్ సింహాచలం పాల్గొన్నారు.

కళాశాల టీచింగ్, నాన్‌ టీచింగ్ సిబ్బంది దుర్గాప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ జపాన్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్యా, ఉద్యోగ అవకాశాలు, సౌకర్యాలను వివరించారు. కైజెన్, తొక్కతసు, ఇకిగాయ్, కింట్సుగి వంటి జపాన్ విధానాల ద్వారా విద్యార్థులు అభివృద్ధి సాధించేందుకు అవసరమైన మెలకువలపై అవగాహన కల్పించారు.జపాన్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పోజర్‌ నుంచి తిరిగొచ్చిన అధ్యాపకుడు దుర్గాప్రసాద్‌కు ఘన సన్మానం ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ జపాన్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్యా, ఉద్యోగ అవకాశాలు, సౌకర్యాలను వివరించారు.

కైజెన్, తొక్కతసు, ఇకిగాయ్, కింట్సుగి వంటి జపాన్ విధానాల ద్వారా విద్యార్థులు అభివృద్ధి సాధించేందుకు అవసరమైన మెలకువలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విజయకుమారి మాట్లాడుతూ దుర్గాప్రసాద్ చేస్తున్న విద్యా ప్రయోగాలు, నిరంతర కృషిని గుర్తించి ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి జపాన్ ఎడ్యుకేషన్ ఎక్స్‌పోజర్‌కు ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. ఈ అవకాశం ఆయన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు