కంగ్టి మండలంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి

18-10-2026 | 07:39pm

పూల పండుగలో మహిళల కోలాహల

పాటలు నృత్యాలతో పల్లెల్లో పండుగ శోభ

కంగ్టి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): కంగ్టి మండల వ్యాప్తంగా బతుకమ్మ(Bathukamma) సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి,ఒకచోట చేరి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చిన మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ,చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.మహిళల కోలాహలం, రంగురంగుల పూల బతుకమ్మలతో పండుగ ప్రాంగణాలు కళకళలాడాయి. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతను, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా సాగాయి. మండలంలోని పలు గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది.

మరిన్ని వార్తలు