సొసైటీ చైర్మన్ లుగా ఐదుగురు నియామకం
బోధన్, అక్టోబర్ 18 (విజయ క్రాంతి) : బోధన్ నియోజకవర్గ(Bodhan Constituency) పరిధిలోని ఐదుగురు సొసైటీలకు నూతన చైర్మన్లను నియమించారు. కల్దుర్కికి చెందిన ప్రకాష్ పటేల్(Prakash Patel), రెంజల్కు చెందిన గుజ్జుల సాయిరెడ్డి, నీలకు చెందిన జావిద్ పటేల్, ధూపల్లికి చెందిన రాములు, జాడి సుందర్ రాజ్ సొసైటీ చైర్మన్లుగా(Society Chairmen) నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం శివాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి(P. Sudarshan Reddy) నూతన చైర్మన్లకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన చైర్మన్లు ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించి, తమకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.
సొసైటీల ద్వారా సభ్యులకు అందాల్సిన సేవలను మెరుగుపరచడం, రైతులు మరియు సభ్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం, సంస్థల కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాల్లో నూతన చైర్మన్లు చొరవ చూపాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. నూతన నియామకాలతో ఆయా సొసైటీల కార్యకలాపాలు మరింత ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.