ఉర్సె షరీఫ్ 24వ మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

20-11-2026 | 06:17pm

దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లెందు టౌన్, నవంబర్ 20 (విజయక్రాంతి): ఇల్లెందు పట్టణం(Illendu town) 1వ వార్డు సత్యనారాయణపురంలో ప్రతి ఏటా నిర్వహించే హజ్రత్ నాగుల్ మీరా మౌలా చాన్ దర్గా ఉర్సె షరీఫ్(Urs-e-Sharif of Hazrat Nagul Meera Moula Chan Dargah) 24వ మహోత్సవ ప్రచార పోస్టర్‌ను ఎమ్మెల్యే కోరం కనకయ్య, తహసీల్దార్ ఖాసిం(Tahsildar Kasim) ఆవిష్కరించారు. అనంతరం దర్గాలో ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 1972లో ఏర్పడిన దర్గా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తోందన్నారు. దర్గాను దర్శించుకున్న భక్తుల(devotees) కోరికలు నెరవేరడంతో మొక్కులు చెల్లించుకోవడానికి తిరిగి వస్తుంటారని తెలిపారు.

ఇల్లెందు పట్టణ ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల భక్తులు(devotees) కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. డిసెంబర్ 7న సాయంత్రం చాదర్, సందల్ కార్యక్రమాలు, 8న జులూస్, దావతే హజ్రత్, సలామీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బోళ్ల సూర్యం, కౌన్సిలర్ ఎస్.కె. సైదా మియా, కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, ఎస్.కె. హసీనా, మాజీ మున్సిపల్ చైర్మన్ పులిగండ్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు