తాటి బిక్షమయ్యకు ఎమ్మెల్యే కోరం కనకయ్య నివాళి

21-09-2026 | 12:36pm

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం మూడు తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాటి బిక్షమయ్య గుండెపోటు(Heart attack)తో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బిక్షమయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని భరించే మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజయ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు