ప్రకృతితో మమేకమైన మహోన్నత పండుగ

18-10-2026 | 09:50pm

పూల వేడుకలతో గ్రామీణ సంస్కృతికి జీవం

కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

​కొత్తగూడెం/పాల్వంచ, (విజయక్రాంతి): పూలను పూజించి ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మ పండుగ(Bathukamma Festival) తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక అని, గ్రామీణ శ్రమజీవుల ఐక్యతకు ఈ సంబరాలు నిదర్శనమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, కొత్తగూడెం పట్టణ పరిధిలోని బస్తీలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆటపాటలతో జరుపుకుంటున్న వేడుకలను ఆయన నేరుగా సందర్శించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎస్సీబీ నగర్, పాత కొత్తగూడెం, విద్యానగర్, శ్రీనగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన ఘాట్లను సందర్శించి, సామూహిక బతుకమ్మల నిమజ్జనోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె పండుగలు మానవ సంబంధాలను బలోపేతం చేస్తాయని, ఆడపడుచుల ముఖాల్లో ఆనందం నింపే ఇలాంటి మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని, పండుగ సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. 

​కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, ప్రజాప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు