చీటింగ్ కేసు నమోదు
ములకలపల్లి, నవంబర్ 22 (విజయక్రాంతి): నెంబర్ ప్లేట్లు మార్చి తిరుగుతున్నటువంటి ద్విచక్రవాహనాన్ని ములకలపల్లి పోలీసులు(Mulakalapalli Police) ఆదివారం స్వాధీనపరచుకున్నారు. ఎస్ఐ మధు ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు ములకలపల్లి మండలం మంగపేట అడ్డరోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పాత గంగారం గ్రామానికి చెందిన వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి ఉన్న 1630కి బదులుగా నెంబర్ ను ఉద్దేశ పూర్వకంగా 1680గా మార్చుకొని తిరుగుతున్నట్లు గుర్తించారు. సదరు ద్విచక్ర వాహనాన్ని స్వాధీన పరుచుకోవడంతో పాటు, వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్లు మార్చడం ఒకదాని నెంబర్ ప్లేటును ఇంకొక వాహనానికి పెట్టుకోవడం వంటి చర్యలకు పాల్పడితే వాహనాలను స్వాధీనపరచుకొని చీటింగ్ కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.