మాదారంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మహా పడిపూజ

22-11-2026 | 08:37pm

ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారం, నవంబర్ 22 : మాదారం గ్రామంలో(Madaram Village) అయ్యప్ప స్వామి మహా పడిపూజ భక్తిశ్రద్ధలతో(devotional) జరిగింది. మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, గడ్డపోతారం వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ పూజలు ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు