లారీ యూనియన్ ఎన్నికల్లో కొండపల్లి రమేష్ రెడ్డి విజయం

22-11-2026 | 08:34pm

సత్తుపల్లి. నవంబర్ 22. ( విజయక్రాంతి): సత్తుపల్లి లారీ యూనియన్ ఎన్నికలు(Sattupalli Lorry Union Elections) ఉత్కంఠభరితంగా సాగాయి. యూనియన్ ఎన్నికల్లో కొండపల్లి రమేష్ రెడ్డి(Kondapalli Ramesh Reddy) అధ్యక్ష పదవికి అత్యధిక ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. ఇతర పదవులకు జరిగిన ఎన్నికల్లోనూ అభ్యర్థులు తమ సత్తా చాటారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పాలకుర్తి దాసు 61 ఓట్లు, ఎండీ ముకరం హుస్సేన్ 62 ఓట్లు సాధించగా, కొండపల్లి రమేష్ రెడ్డి 212 ఓట్లు సాధించి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 

కార్యదర్శి పదవికి జరిగిన ఎన్నికల్లో పల్లి కోటేశ్వర్ రెడ్డికి 119 ఓట్లు రాగా, మద్దాల మురళి 216 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఉయ్యూరు అచ్చిరెడ్డి 114 ఓట్లు, కమిలి షేక్ (ఖలీల్) 182 ఓట్లు, శేషగిరిరావు 37 ఓట్లు సాధించారు. కమిలి షేక్ (ఖలీల్) విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ పదవికి జరిగిన పోటీలో షేక్ గౌస్ 84 ఓట్లు, వి. సురేష్ (ఏసు) 164 ఓట్లు, బి. వేణు 86 ఓట్లు సాధించారు. వి. సురేష్ (ఏసు) విజయం సాధించారు.

ట్రెజరర్ పదవికి జరిగిన ఎన్నికల్లో మాదర్ 49 ఓట్లు, విజయ్ 124 ఓట్లు, ఎస్కే మౌలాలి 163 ఓట్లు సాధించారు. ఎస్కే మౌలాలి విజయం సాధించారు. లారీ యూనియన్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు యూనియన్ సభ్యులు, అభిమానులు అభినందనలు తెలిపారు. నూతన కమిటీ యూనియన్ అభివృద్ధికి, లారీ యజమానులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు