అనురాగ్ లో సేల్స్‌ఫోర్స్ వర్క్‌షాప్

08-10-2026 | 08:07pm

ఘట్ కేసర్, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీలోని(Anurag University) సీఎస్ఐ ప్రొఫెషనల్ చాప్టర్, ఎనిగ్మా క్లబ్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బియాండ్ సీఆర్‌ఎమ్ ఎక్స్‌ప్లోరింగ్ సేల్స్‌ఫోర్స్(Beyond CRM: Exploring Salesforce) అనే అంశంపై సాంకేతిక వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ప్రముఖ నిపుణుడు కాశిసాయి శ్రీరామ్ వెంకట్ విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్, సీఆర్‌ఎమ్, సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ ఫారమ్‌లపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న ఆధునిక వ్యాపార రంగంలో కస్టమర్ డేటా నిర్వహణ, సేల్స్ మరియు మార్కెటింగ్ కార్యకలాపాలకు సేల్స్‌ఫోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఐఏఏఎస్, సాస్, పాస్ వంటి క్లౌడ్ సర్వీస్ మోడల్స్‌తో పాటు ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్ వంటి ప్రముఖ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రాముఖ్యతను ఆయన విద్యార్థులకు తెలియజేశారు. ఈవర్క్‌షాప్‌లో సుమారు 70 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని లబ్ధి పొందారు.

మరిన్ని వార్తలు