బాలిక మృతికి న్యాయం చేయాలని దర్నా

10-10-2026 | 11:34pm

హుజూర్ నగర్, అక్టోబర్ 10: జ్వరంతో బాధపడుతూ హాస్పటల్(Hospital) లో చేరిన బాలికకు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి  వైద్యులు చికిత్స(Treatment by doctors at Huzurnagar Area Hospital) అందించటంలో నిర్లక్ష్యం వహించారని  అందువల్ల తమ పాపమృతి చెందిందని బంధువులు రోడ్డుపై ఆందోళన చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపాలెం మండలంలోని నక్కగూడెం గ్రామానికి చెందిన మాలోతు మల్లేశ్వరి (12) ఈనెల 7న సాయంత్రం డెంగ్యూ ఫీవర్(Dengue Fever) తో హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయింది.

శనివారం ఉదయం ఆక్సిజన్ లెవెల్ అందక  ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో  108లో  సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించి అడ్మిట్ చేయగానే మల్లేశ్వరి మృతి చెందింది.మృత దేహాన్ని అంబులెన్స్ లో హుజూర్ నగర్ కు తీసుకువచ్చి ఇందిరా సెంటర్ లో తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టాలని మృతి చెందిన బాలిక బంధువులు హుజూర్ నగర్ పట్టణానికి తీసుకురావడంతో వారిని ఎస్ఐ చలిగంటి నరేష్ అడ్డుకున్నారు.

పట్టణంలో ఎలాంటి ధర్నాలు రాస్తారోకోలు చేయవద్దని ఉద్దేశంతో పోలీస్ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని మృతురాలు గ్రామమైన నక్కగూడెం తండాకు తరలించారు. నక్కగూడెం తండా వాసులు, బంధువులు పోలీసులను అడ్డుకొని గొడవకు దిగడంతో గ్రామంలో పరిస్థితి ఒక్కసారిగా ఉధృతంగా మారింది.

దీంతో చేసేది లేక  పోలీసులు వేనుదిరిగారు.దీంతో బాలిక బంధువులు మృతదేహాన్ని హుజూర్ నగర్ పట్టణానికి తీసుకొస్తున్నట్టు సమాచారం.కాగా హుజూర్ నగర్ పట్టణంలో ఆయా మండలాల ఎస్ఐలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.పట్టణంలోని ఇందిరా సెంటర్లో బంధువులు ఆందోళన చేపట్టడంతో పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

మరిన్ని వార్తలు