దేశంలో Weather టెన్షన్.. 16 రాష్ట్రాలకు IMD అలర్ట్

08-10-2026 | 06:54am

న్యూఢిల్లీ: అక్టోబర్ 8న దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. భారత వాతావరణ శాఖ (India Meteorological Department) తాజా అంచనాల ప్రకారం 16 రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, పిడుగులు, బలమైన గాలులు కనిపించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 60 నుంచి 75 కిలోమీటర్ల వరకు చేరొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ల్యాండ్‌స్లైడ్ ప్రమాదం ఉండొచ్చని అధికారులు అప్రమత్తం చేశారు. 08 October Weather Forecast ప్రకారం ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బిహార్, మధ్యప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. నేపాల్‌తో పాటు బిహార్, ఉత్తరప్రదేశ్, సిక్కిం ప్రాంతాల్లో అక్టోబర్ 10 వరకు Thunderstorm, Lightning, Rain Alert కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది.

ఉత్తర భారతంలో Weather ఎందుకు మారుతోంది?

ఉత్తర పశ్చిమ భారతంపై ప్రస్తుతం Western Disturbance ప్రభావం కొనసాగుతున్నట్లు IMD వెల్లడించింది. దీని ప్రభావంతో అక్టోబర్ 8, 10 తేదీల్లో జమ్మూ కశ్మీర్, లడఖ్, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌కు ఇప్పటికే Yellow Alert జారీ చేశారు. అక్టోబర్ 8, 9 తేదీల్లో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశంతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచొచ్చని, గాలుల వేగం ఒక్కోసారి 50 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కూడా Thunderstorm and Lightning Alert ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

దక్షిణాది రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు

ఉత్తర భారతంతో పాటు South India Weatherలో కూడా మార్పులు కనిపించనున్నాయి. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో అక్టోబర్ 8 నుంచి 10 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కేరళలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో అక్టోబర్ 8న విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉండగా.. కొన్ని చోట్ల Heavy Rainfall Alert కొనసాగనుంది.

ఒడిశా, ఝార్ఖండ్, బిహార్‌లో ఏం జరుగుతుంది?

ఝార్ఖండ్‌లో అక్టోబర్ 8న అనేక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచొచ్చు. ఒడిశాలో పరిస్థితి మరింత అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది. అక్కడ Thunderstorm, Lightning and Strong Windsతో పాటు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది. బిహార్‌లో అక్టోబర్ 8 నుంచి 10 వరకు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 11 నుంచి 13 వరకు రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండొచ్చని అంచనా.

మధ్య భారతంలోనూ వానల ప్రభావం

ఛత్తీస్‌గఢ్‌లో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది. తూర్పు మధ్యప్రదేశ్‌లో పిడుగులు పడే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. తీర ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో కూడా అక్టోబర్ 8న బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.

ఢిల్లీ-NCRలో ఎలా ఉంటుంది?

Delhi Weather 8 October విషయానికి వస్తే.. గురువారం అక్కడ ప్రధానంగా పాక్షికంగా మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 నుంచి 24 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమయ్యే గాలులు మధ్యాహ్నం 18 కిలోమీటర్లు, రాత్రికి 20 కిలోమీటర్ల వరకు పెరగొచ్చని IMD తెలిపింది.

తెలంగాణకు కూడా కీలక Weather Update

ఇదిలా ఉండగా Telangana Weather Updateపై కూడా IMD కీలక సూచన చేసింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంటే ఒకవైపు Monsoon Withdrawal వేగం పెరుగుతుండగా.. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, పిడుగులు, బలమైన గాలులు కొనసాగనున్నాయి. దీంతో అక్టోబర్ 8 నుంచి 10 వరకు ప్రయాణాలు చేసే వారు, ముఖ్యంగా కొండ ప్రాంతాలు మరియు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు IMD Weather Alertలను గమనించడం కీలకంగా మారింది.

మరిన్ని వార్తలు