జమ్మికుంటలో గరుడ వస్త్ర సిల్క్స్
ఘనంగా ప్రారంభించిన సినీ నటి నభా నటేష్
జమ్మికుంట, అక్టోబర్ 16 (విజయకాంతి): తెలంగాణలో వస్త్ర వ్యాపార రంగంలో తనదైన గుర్తింపును చాటుకుంటున్న గరుడ వస్త్ర సిల్క్స్(Garuda Vastra Silks) సంస్థ జమ్మికుంటలో కొత్తగా గరుడ వస్త్ర సిల్క్స్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. జమ్మికుంటలోని సురక్ష హాస్పిటల్ పక్కన ఏర్పాటు చేసిన గ రుడ వస్త్ర సిల్క్స్ ఫ్యామిటీ షాపింగ్ మాల్ ను శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రముఖ సినీ నటి నభా నటేష్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా గరుడ వస్త్ర సిల్క్స్ చెందిన జక్క రఘునందన్ రెడ్డి మా ట్లాడుతూ జమ్మికుంట పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి నూతన షో రూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసి, ప్రత్యేక వస్త్ర కలెక్షన్లను, ప్రారంభోత్సవ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గరుడ వస్త్ర సిల్క్స్‌కు చెందిన అనంత్‌రెడ్డి మాట్లాడుతూ, బనారసీ, కాంచీపురం, ధర్మవరం, గద్వాల్ వంటి ప్రసిద్ధ సంప్రదాయ చేనేత వ స్త్రాల అద్భుతమైన వైభవాన్ని, భారతీయ చేనేత వారసత్వపు గొప్పదనాన్ని మా కలెక్షన్ల ద్వారా వినియోగదారులకు అందిస్తున్నాం.. సంప్రదాయ అందానికి ఆధునిక శైలిని జోడి స్తూ, నాణ్యత, ప్రామాణికత, సొగసుకు ప్రా ధాన్యతనిస్తూ ప్రతి సందర్భానికి తగిన ప్రత్యే క వస్త్రాలను అందించడమే మా లక్ష్యమని తెలిపారు.
జక్క రఘునందన్ రెడ్డి, అనంత్ రెడ్డి, జక్క శమంతకమణి, జక్క మానీషా, జక్క శ్రేయ నాయకత్వంలో ఈ ప్రారంభోత్స వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో పాటు రాజకీయ ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్రమోషన్లను కూడా సంస్థ అందించనుంది.