7.1 శాతం భారత్ వృద్ధి
- 2026-27 వరల్డ్ బ్యాంక్ నివేదిక అంచనా
- అనిశ్చితులున్నా ఆశించిన స్థాయిలో..
- లోటు వర్షపాతాన్ని భర్తీ చేయనున్న పారిశ్రామిక రంగం
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారతదేశ వృద్ధి(India's growth) అంచనా నివేదికను ప్రపంచబ్యాంకు(World Bank) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2026- 27 ఆర్థిక సంవత్సరానికి 7.1 శాతంగా వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదు కావడంతో అంచనాలను వరల్డ్ బ్యాంక్ సవరించిందని ‘ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్’(India Development Update) మంగళవా రం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొం ది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది.
జీఎస్టీ కోతల కారణంగా పట్టణ వినియోగం బలహీనపడింది. సబ్సిడీలు, తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా గ్రా మీణ వినియోగం పుంజుకుంది. అంతర్జాతీ య ప్రతికూలతలున్నప్పటికీ ఆదాయ పన్ను ఉపశమనాలు పారిశ్రామిక రంగం(Industrial sector) ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలను ఇ చ్చింది. నైరుతి రుతుపవనాలు లోటు వర్షపాతం వ్యవసాయ రంగంపై(Agricultural Sector) ప్రభావం చూ పే అవకాశం ఉంది. ఈ లోటును పారిశ్రామిక రంగం భర్తీ చేస్తుంది. సేవల రంగం నెమ్మదించినా స్థిరంగా కొనసాగుతుంది.
పెరుగుతున్న అనిశ్చితుల మూలంగా ప్రైవేట్ పెట్టుబడులపై భారం పడుతుంది. అదే సమయంలో ప్రభుత్వ బలమైన పెట్టుబడులతో ఆర్థిక విధాన పరిస్థితులు ఈ భర్తీని పూడ్చనున్నాయి. భారత ఎగుమతులు అంచనాల కు మించి రాణిస్తుండగా, 2027 ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాలకు ఇవే ప్రధాన సానుకూలతలుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7 శాతం నమోదయ్యే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ, ఫిచ్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఓఈసీడీలు కూడా ఇటీవల పేర్కొన్నాయి.