ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? : కవిత
సనుగుల: తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులు ఆశించిన సమాజాన్ని నిర్మించడమే వారికి ఇచ్చే అసలైన నివాళి అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. చందుర్తి మండలం సనుగులలో మంగళవారం నిర్వహించిన ‘అమరుల యాది’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
అధికారంలో అన్ని వర్గాలకు సముచిత భాగస్వామ్యం దక్కినప్పుడే అమరుల త్యాగాలకు నిజమైన ఫలితం లభిస్తుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారి కుటుంబాల పరిస్థితిని సమాజం గుర్తించాలని అన్నారు. తెలంగాణ(Telangana) సాధించి 13 ఏళ్లు గడిచినా పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులోకి రాకపోవడంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. “ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ?” అని ప్రశ్నించారు.
ప్రస్తుతం దోపిడీ రూపం మారిందని, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం అవసరమని అన్నారు. యువత, మహిళలు రాజకీయాల్లోకి మరింతగా రావాలని పిలుపునిచ్చారు. అమర వీరుల కుటుంబాలు(Telangana Martyrs Families), మాజీ మావోయిస్టుల కుటుంబాలకు న్యాయం జరిగేలా తమ వంతు పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.