ఇటకాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. సర్పంచ్ మృతి

17-09-2026 | 10:46am

వరంగల్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటకాలపల్లిలో రోడ్డు ప్రమాదం(road accident) చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొన్న ఘటనలో నల్లబెల్లి మండలం లెంకాలపల్లికి చెందిన దంపతులు రవీందర్, విజయలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ విజయలక్ష్మి (40) మృతి చెందారు. ఆమె భర్త రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కాగా, మృతురాలు విజయలక్ష్మి నల్లబెల్లి మండలం లెంకాలపల్లి గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు