బడంగ్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

29-09-2026 | 01:19pm

హైదరాబాద్‌ బడంగ్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. స్కూటీపై వెళ్తున్న నాదర్‌గుల్‌కు చెందిన ఏనుగు ప్రసన్నలక్ష్మి.. ఎదురుగా ఆటో రావడంతో సడన్‌గా బ్రేక్‌ వేయడంతో కిందపడింది. అదే సమయంలో పక్కనే వెళ్తున్న ట్రాక్టర్‌ ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు