సీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
29-09-2026 | 01:51pm
జైనూర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్‌సీ) జిల్లా కలెక్టర్ కె. హరిత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ వార్డును పరిశీలించి, చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మందుల నిల్వ, ల్యాబ్‌ను పరిశీలించారు. సిబ్బంది హాజరు తనిఖీ చేశారు.ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రతను నిరంతరం పాటించాలని సూపరింటెండెంట్ అశోక్‌ను ఆదేశించారు.ఏజెన్సీ ప్రాంతం కావడంతో వైద్య సేవల్లో ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట డాక్టర్ మురళీకృష్ణ, వైద్య సిబ్బంది ఉన్నారు