పాత కక్షలతో గొడ్డలితో దాడి..
కోటపల్లి, ( విజయక్రాంతి ) మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేటలో (Nagampet)పాత కక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి (Attempted murder) పాల్పడిన పన్నాల సంతోష్ (27)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగంపేటకు చెందిన లక్కం తిరుపతి పొలం నుంచి తిరిగి వస్తుండగా సంతోష్ గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాధితుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, గురువారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకుని, దాడికి ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని చెన్నూర్ కోర్టులో హాజరుపరిచినట్లు కోటపల్లి ఎస్ఐ ఎస్. రాజశేఖర్ తెలిపారు.