జిపి కార్మికులకు బట్టలు, రక్షణ పరికరాల పంపిణీ
మునుగోడు, అక్టోబర్ 16(విజయాక్రాంతి) : మునుగోడు గ్రామ పంచాయతీ(Munugodu Grama Panchayat) పరిధిలో నిరంతరం శ్రమిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య, సఫాయి కార్మికులకు(sanitation and cleaning workers) శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో(Gram Panchayat Office) దుస్తులు మరియు భద్రతా సామగ్రి మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్(Munugode Sarpanch Palakuri Ramadevi Narasimha Goud) ,సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి,ఉప సర్పంచ్ సుగుణమ్మ ,వార్డు సభ్యులతో కలిసి, గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు స్వయంగా ఈ పరికరాలను అందజేశారు.సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని రోగాల బారిన పడకుండా పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకం అన్నారు.