పిచ్చికుక్కల స్వైర విహారం

16-10-2026 | 07:05pm

బాలికకు గాయాలు ఆసుపత్రి తరలింపు

కన్నాయిగూడెం, అక్టోబర్ 16(విజయక్రాంతి) : ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పిచ్చికుక్క స్వైర విహారం(Rampage of a mad dog) చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) ధర్మారావు పేట గ్రామం, గణపురం మండలానికి చెందిన కోడెపాక సుకన్య, ప్రశాంత్ దంపతుల కుమార్తె ప్రణవి(4)దసరా సెలవులకి అమ్మమ్మ వాళ్ళ గ్రామం ముప్పనపల్లికి వచ్చింది. ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటున్న పాపను పిచ్చికుక్క దాడి(Mad dog attack) చేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పాపను మెరుగైన వైద్యం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. గ్రామాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని పలువు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో పిచ్చి కుక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు