బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్
16-10-2026 | 06:50pm
కూసుమంచి, అక్టోబర్ 16(విజయక్రాంతి): బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్ కు(MLC Enrollment) సంబంధించి సుమారు 50 అప్లికేషన్లను డిప్యూటీ తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్ ఖాన్ కి(Deputy Tahsildar Khaja Moinuddin Khan) సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ గడ్డం వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు మహేందర్ నాయక్, ఎమ్మెల్సీ మండల కో-కన్వీనర్లు వడ్డంపూడి నరేష్, బానోత్ మోతీలాల్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నబోయిన ఉదయ్ కిరణ్, గిరిజన మోర్చా నాయకులు జర్పుల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.