అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్
ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్(Additional Collector Yuvraj Marmat) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ, అంగన్వాడీ, వీఓ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.
మూత్రశాలలు లేని అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీలు, ఆశ్రమ పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అటవీ భూముల సమస్యలున్న చోట ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి, పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.