రాష్ట్రస్థాయి హ్యండ్బాల్ పోటీలకు విద్యార్థులు

28-09-2026 | 12:33pm

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఈ నెల 25 న చెర్వు అన్నారం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో(ZPHS School) జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు చిన్న కందుకు విద్యార్థులు ఎంపికయ్యారని చిన్న కందుకూర్ ప్రధానోపాధ్యాయులు కె రామచందర్ రావు   తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 70వ ఎస్ జి ఎఫ్ ఐ  ఉమ్మడి నల్గొండ జిల్లాస్థాయి హ్యండ్బాల్ పోటీలలో చిన్నకందుకూర్ ఉన్నత పాఠశాల కు చెందిన 17 సంవత్సరాల  విభాగంలో  ఎన్ పల్లవి, 14 సంవత్సరాల  విబాగులో  జి ప్రవళిక, ఎమ్.వాసిని,ఎమ్ చైత్ర, బి.బాలు ప్రియ, కే బాబుకుమార్ లు ఉత్తమ ప్రతిభకనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని అన్నారు.

ఎంపికైన క్రీడాకారులను గ్రామ సర్పంచ్  బొల్లారం లింగస్వామి, వార్డు సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చే నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు బుగ్గ కేశనాగులు తెలిపారు. ఈ కార్యక్రమంతో ఉపాధ్యాయులు  ఎల్ జానకి, సైదులు, రమేష్, సతీష్, మహేష్  పాల్గొన్నారు

మరిన్ని వార్తలు