పూరీ జగన్నాథ్ బర్త్‌డే స్పెషల్.. (వీడియో)

28-09-2026 | 12:23pm

పూరీ బర్త్‌డే స్పెషల్.. ‘SlumDog’లో జరీనా వహాబ్‌కి అదిరిపోయే ఇంట్రో!

పూరీ జగన్నాథ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘SlumDog’ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. విజయ్‌ సేతుపతి హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి జరీనా వహాబ్(Zarina Wahab SlumDog) కీలక పాత్రలో కనిపించనున్నారు. పూరీ బర్త్‌డే(Puri Jagannadh birthday) సందర్భంగా మేకర్స్‌ జరీనా వహాబ్‌ పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె ‘జుబైదా’ (Zubeidaa) పాత్రలో కనిపించనున్నారు.

ఇంట్రో వీడియోతో జుబైదా పాత్ర ఎలా ఉండబోతోంది? కథలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? అనే ఆసక్తి మొదలైంది. పూరీ జగన్నాథ్‌ సినిమాల్లో పాత్రలకు ఉండే ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్‌ కారణంగా.. ‘SlumDog’లో జరీనా పాత్ర కూడా ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi SlumDog) హీరోగా, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వరుసగా వస్తున్న అప్డేట్స్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇప్పుడు జుబైదా ఇంట్రో కూడా అదే లైన్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.



మరిన్ని వార్తలు