స్టాక్ మార్కెట్‌కు షాక్! సెన్సెక్స్ భారీ పతనం
సెన్సెక్స్ 730 పాయింట్లు పతనం!
ముంబై, సెప్టెంబర్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market Crash) సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా ఒత్తిడికి గురయ్యాయి. పెరుగుతున్న ముడిచమురు ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దీంతో ప్రారంభ ట్రేడింగ్‌లో (bse sensex)బీఎస్‌ఈ సెన్సెక్స్ 730 పాయింట్లకు పైగా పడిపోయి 73,170.12 స్థాయికి చేరింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(Nifty 50) 231.50 పాయింట్లు నష్టపోయి 22,908.95 వద్ద ట్రేడైంది.
మరోవైపు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా మార్కెట్‌పై ఒత్తిడిని పెంచినట్లు తెలుస్తోంది. ముడిచమురు(Crude oil) ధరల కదలికలు, అంతర్జాతీయ పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు. ఒక్కసారిగా సూచీలు భారీగా క్షీణించడంతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. రానున్న సెషన్లలో అంతర్జాతీయ మార్కెట్ల(International markets) సంకేతాలు, చమురు ధరలు దేశీయ ఈక్విటీ మార్కెట్‌పై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.