మను భాకర్‌కు నిరాశ!
ఒక్కరు ఫైనల్‌లోకి.. మరొకరు ఇంటికి!
నాగోయా, సెప్టెంబర్ 28: భారత స్టార్ షూటర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్కు(Manu Bhaker Asian Games 2026) ఆసియా క్రీడల్లో నిరాశ ఎదురైంది. మహిళల 25 మీటర్ల ఎయిర్-పిస్టల్ ఈవెంట్‌లో ఆమె ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో ఈ క్రీడల్లో(India shooting Asian Games 2026) మను భాకర్ పతకం సాధించకుండానే తన ప్రయాణాన్ని ముగించనుంది. క్వాలిఫికేషన్‌లో మను భాకర్ 579 పాయింట్లు సాధించి 11వ స్థానంలో నిలిచింది.
తుది ఎనిమిది మందిలో చోటు దక్కకపోవడంతో ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లోనూ మను భాకర్ ఫైనల్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో భారీ అంచనాలతో ఆసియా క్రీడల్లో అడుగుపెట్టిన ఆమెకు ఈసారి పతకం దక్కలేదు. మరోవైపు భారత షూటర్ ఈషా సింగ్(Esha Singh 25m pistol) మాత్రం 25 మీటర్ల ఎయిర్-పిస్టల్ ఈవెంట్‌లో సత్తా చాటి ఫైనల్‌కు చేరింది. తుది ఎనిమిది మందిలో స్థానం సంపాదించడంతో భారత్ పతక ఆశలు కొనసాగుతున్నాయి. మను భాకర్ నిష్క్రమణతో నిరాశ చెందిన భారత అభిమానులకు.. ఈషా సింగ్ ఫైనల్ చేరడం కాస్త ఊరటనిచ్చింది.