ఆర్టీసీ బస్సు-డీసీఎం ఢీ
04-11-2026 | 08:13am
తల్లాడ,నవంబర్ 4(విజయక్రాంతి): తల్లాడ దేవరపల్లి(Devarapalli) జాతీయ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. సత్తుపల్లి డిపో కి చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళుతుండగా, హైదరాబాద్ నుంచి తిరువూరుకు పచ్చల సీసాలతో వెళుతున్న డీసీఎం వ్యాన్ రెండు ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న తల్లాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.