అత్యాశతో గ్యాంబ్లింగ్ ప్రపంచంలోకి వెళితే..
క్యూరియాసిటీ పెంచుతున్న ‘పాకెట్ రాకెట్స్’
మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela)కు చెందిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘పాకెట్ రాకెట్స్(Pocket Rockets)’. రుద్ర అత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. మేకర్స్ ‘ఫస్ట్ హ్యాండ్’ పేరుతో విడుదల చేసిన ఈ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్ ఓపెనింగ్ చాలా ఆసక్తికరంగా సాగింది.
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఒక తెలివైన, పేద విద్యార్థి తన కలలను నెరవేర్చుకోవడానికి డబ్బు కోసం గ్యాంబ్లింగ్ ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టాడనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. హీరోయిన్ సహాయంతో హీరో, అతని స్నేహితుడు శ్రీలంకలోని కాసినోల ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. మొదట్లో అవసరం కోసం జూదం ఆడిన హీరో, ఆ తర్వాత ఆ డబ్బుకు, గ్యాంబ్లింగ్‌కు ఎలా బానిసయ్యాడు? అత్యాశ మనుషులను ఏ స్థాయికి తీసుకెళ్తుంది? అనే యూత్‌ఫుల్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్‌తో టీజర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. టాలీవుడ్‌లో గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలు చాలా తక్కువ. ఈ సినిమా ఎంచుకున్న ‘హ్యూమన్ గ్రీడ్’ (మనుషుల అత్యాశ) అనే పాయింట్ టీజర్‌లో చాలా బాగా ఎలివేట్ అయింది.
‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ త్రినాథ్ వర్మ హీరోగా మెప్పించగా, సరికొత్తగా పరిచయమవుతున్న నిర్మల్ కూడా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ శ్రియా కొంతం స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇక కీలక పాత్రలో కనిపిస్తున్న జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల పాత్రలు సినిమాపై మరింత హైప్‌నున పెంచుతున్నాయి. ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ కాసినోల గ్లామరస్, సస్పెన్స్ వాతావరణాన్ని అద్భుతంగా క్యాప్చర్ చేసింది. గ్యానీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని మూడ్‌ను పర్‌ఫెక్ట్‌గా సెట్ చేసింది. అన్వర్ అలీ ఎడిటింగ్ కట్స్ క్రిస్పీగా ఉన్నాయి. కేవలం క్రైమ్ థ్రిల్లర్‌గానే కాకుండా స్నేహితుల మధ్య సాగే కామెడీ డైలాగ్స్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి.
అయితే, టీజర్ చాలా విషయాలను సస్పెన్స్‌గా ఉంచింది. కథలో వచ్చే ప్రధాన ట్విస్టులు, ఆ తర్వాత జరిగే పర్యవసానాలను పెద్దగా రివీల్ చేయలేదు. ఇది సినిమాపై క్యూరియాసిటీ పెంచడానికి ప్లస్ అయినప్పటికీ, కథపై పూర్తి స్పష్టత రావాలంటే ట్రైలర్ వరకు ఆగాల్సిందే. మొత్తంగా చూసుకుంటే.. ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ చాలా ప్రామిసింగ్‌గా, ఆసక్తికరంగా ఉంది. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌ను చూడాలనుకునే ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. నిర్మాతగా నిహారిక కొణిదెల ఖాతాలో మరో సక్సెస్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇదే ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది. మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.