ఆర్గానో ‘దీపావళి ధమాకా’

04-11-2026 | 05:25am
  1. కవర్ల వెనుక కబ్జాల కథ!
  2. చేవెళ్లలో విచ్చలవిడి అక్రమాలు.. 
  3. గుట్టల తవ్వకం.. ప్రకృతి వాగుల పూడ్చివేత!
  4. నోరు నొక్కేసిన ‘మిఠాయి’ కానుకలు
  5. సంయుక్త శాఖల అధికారులకు నజరానాలు
  6. అసలు వెనుక గుట్టు వేరే అంటూ ప్రజల సెటైర్లు..

రంగారెడ్డి బ్యూరో /చేవెళ్ల, నవంబర్ 3(విజయక్రాంతి): చేవెళ్ల మండలంలో(Chevella Mandal) ఆర్గానో విల్లాస్(Organo Villas) నిర్వాహకుల అక్రమాలు రోజురోజుకూ హద్దుమీరుతున్నాయి. ప్రభుత్వ భూములు కబ్జా(Encroachment of government lands) చేయడం, గుట్టలను తవ్వి వాగులను పూడ్చేయడం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థ... విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులకే దీపావళి కానుకల పేరుతో ఖరీదైన మిఠాయిలతో పాటు నజరానాలు పంచి ప్రసన్నం చేసుకుంటోందనే ఆరోపణలు వెళ్ళు వెతుకుతున్నాయి. ప్రజాధనంతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు రక్షణగా ఉండాల్సిన అధికారులే ఈ ప్రలోభాలకు తలొగ్గి మౌనం వహిస్తుండడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విచారణ నీరుగారుతోంది... నివేదికలు ఏమయ్యా యి?....

 ఆలూరులోని ఆర్గానో విల్లాస్కు ప్రభుత్వ భూమిలోంచి అక్రమంగా రోడ్డు మార్గం వేశారు. దీనిపై గ్రామస్తులు, పంచాయతీ సభ్యులు ఎమ్మార్వో, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో నేరుగా కలెక్టర్కు ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు. మీర్జాగూడ గ్రామం నుంచి ఆర్గానోకు 40 అడుగుల రోడ్డు వేసేందుకు గుట్టను తవ్వి, ప్రకృతిసిద్ధమైన వాగును పూర్తిగా పూడ్చేశారని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మౌనం వెనుక ఆంతర్యం....

ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్, పంచాయతీ శాఖల అధికారులు క్షేత్రస్థాయి విచారణకు వెళ్లినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవ్వడం వెనుక పెద్దఎత్తున అమ్యామ్యాలు చేతులు మారినట్లు స్థా నికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.దీపావళి ముసుగులో అధికారులకు మామూళ్ల పర్వంసాధారణంగా పండుగలకు వ్యాపార సంస్థలు మితంగా స్వీట్లు పం చుకోవడం ఆనవాయితీ. కానీ, ఆర్గానో ని ర్వాహకులు స్వీట్ బాక్సులతో పాటు ’కవర్లు’ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మంగళవారం సాయంత్రం ఆర్గానో కార్లు పోలీస్ స్టేషన్లు, ఎమ్మార్వో, ఆర్డీవో, వ్యవసాయ, ఇరిగేషన్, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాయి.పనుల నిమిత్తం వచ్చిన సామాన్యులు అధికారుల టేబుళ్లపై ఉన్న ఖరీదైన స్వీట్ బాక్సులు, కవర్లను చూసి విస్మయానికి గురవుతున్నారు.

అధికారులు, పోలీసుల అండదండలు పుష్కలంగా ఉండటం వల్లే వందలాది ఎకరాలలో రైతుల భూములు సేకరిస్తూ, పారే వాగులను తమ ప్రాజెక్టులోకి మళ్లించుకుంటున్నారని అంతారం గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రజల డిమాండ్....

 ఆర్గానిక్ విల్లాలపై ఉన్నత స్థాయి విచారణ జరగాలని ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ గుట్టలు తోడి, వాగులు మళ్లించిన వారిపై మైనింగ్ మరియు రెవెన్యూ శాఖలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెళ్ళు వెతుకుతున్నాయి. సామాన్యుల భూములు లాక్కునే క్రమంలో ఇదే తరహా ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడ్డారా అనే అనుమానాలుబలపడుతున్నాయి.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకుని, అధికారులకు కవర్లు పంచిన ఆర్గానో నిర్వాహకులపై, వారికి సహకరిస్తున్న అధికారులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు