వేంసూరు మండలం లచ్చన్నగూడెంలో విషాదం
21-09-2026 | 12:18pm
వేంసూర్ సత్తుపల్లి.సెప్టెంబర్ 21.(విజయ క్రాంతి): లచ్చన్నగూడెం(Lachhannagudem) గ్రామానికి చెందిన పుచ్చకాయల వీరస్వామి పాముకాటుతో మృతి చెందడంతో, వారి పార్థివదేహాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్(Matta Dayanand) విజయ్ కుమార్ సందర్శించి,పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి,వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.