రేషన్ డీలర్ ఆకస్మిక మృతి.. గ్రామంలో విషాదం
చికిత్స కోసం స్వయంగా బైక్‌పై వెళ్లి.. గ్రామంలో విషాదం
నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలం వల్లూరు గ్రామానికి(Valluru ration dealer) చెందిన రేషన్ డీలర్ సామెల్ (45) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి(heart attack) చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటల సమయంలో నిద్రలేచిన సామెల్‌కు ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స కోసం తన బైక్‌పై ఒంటరిగా మనూరు మండలం ఎల్గోయి గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లారు. అక్కడ బీపీ పరీక్షిస్తున్న సమయంలో కుప్పకూలి మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం సామెల్‌ను నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి(Narayankhed Area Hospital) తరలించగా, పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రేషన్ డీలర్‌గా పనిచేస్తున్న సామెల్ ఆకస్మిక మృతితో వల్లూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.