చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలి
26-09-2026 | 11:45am
బోథ్. సెప్టెంబర్ 26 ( విజయక్రాంతి): చాకలి ఐలమ్మ(Chakali Ailamma) స్ఫూర్తితో ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులు పన్నాల రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని పో చ్చేర గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం ఆత్మ గౌరవం కోసం సాగిన పోరాటంలో ఐలమ్మది చెరగని ముద్ర అన్నారు సామాజిక వివక్ష దోపిడి అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం నేటి సమాజానికి కనువిప్పు గా ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, రజక సంఘం అధ్యక్షులు సాగర్ ,రాజేశ్వర్, స్వామి , భోజన్న, సాయి కృష్ణ, రవితేజలు పాల్గొన్నారు