చాకలి ఐలమ్మ పోరాటం నేటి తరానికి అనుసరణీయం
26-09-2026 | 12:09pm
పటాన్ చెరు, సెప్టెంబర్ 26: చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని.. పటాన్ చెరు డివిజన్(Patancheru Division) పరిధిలోని రజక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో జరిగినసాయుధ రైతాంగ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారని అన్నారు. నేటి తరానికి వారి చరిత్రను తెలిపేలా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రజక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.