త్యాగేనైకేన అమృత త్వమానశుః
ఆయన పేరు చెరుకూరి రామారావు(Cherukuri Ramarao). కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎంత సంపద ఉన్నప్పటికీ, దైవాన్ని మరవలేదు, ధర్మాన్ని మరవలేదు. ఒక బ్యాంకు ఉద్యోగిగా తన జీవితాన్ని ఆరంభించిన రామారావు స్వచ్ఛందంగా బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి వ్యాపారంలో నిలదొక్కుకున్నాడు. బ్యాంకు ఉద్యోగాన్ని విడిచినప్పుడు ‘నీవు ఎలా బ్రతుకుతావు’ నీ పిల్లల నెలా పోషిస్తావు?’ అని బంధువులడిగితే, ‘ధైర్యే సాహసే లక్ష్మీ’ అని వారికి సమాధానం ఇచ్చాడు. తెలివిగలవాడు ఒక రూపాయ పెట్టుబడి పెట్టి ధనవంతుడు కావచ్చునని వారికి తెలియజేశాడు. అట్లే రామారావుగారు ‘చెరుకూరి గ్రూప్’ను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగినాడు.
“నా గ్రూపులో పెట్టుబడి పెట్టినవారికి లాభం చేకూర్చడమే నా పని. ఎవరైనా పెట్టుబడి పెడితే దానికి అనుగుణంగా భూమినికొని పెడుతాను. భూమి ధర పెరిగినట్లే వారి పెట్టుబడికి తగిన వృద్ధి లభిస్తుంది” అని నాతో చెప్తుంటే రామారావు వ్యాపార దక్షత, కార్యకుశలత ఎలాంటివో తెలిశాయి.
రామారావు గారితో నాకు చిత్రంగా పరిచయం కల్గింది. వనస్థలీపురంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ రంగయ్య చౌదరిగారు, కార్యదర్శి మధు సూదనరావు గారు కలిసి ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు శ్రీ రామారావుగారు వచ్చారు. నేను ఆ సభలో ఒక వయోధికునిగా పాల్గొన్నాను. ప్రధాన వక్తను నేనే.
ఆ సభలో ప్రధాన ఆకర్షణ చెరుకూరి రామారావు గారిదే. తెల్లని దు స్తుల్లో కనిపించే రామారావు ఎత్తున మని షి. ఆయన భాషణ సరళంగా ఉం టుంది. ఆయన మదిలో ఎక్కడా గర్వం కనిపించదు. అందరిని ఆప్యాయంగా పలకరించ డం, చేతులు రెండూ పూర్తిగా జోడించి నమస్కరించడం ఆయన కలవాటు. ప్యాం టు, షర్టు వేసుకున్నప్పటికీ ఒక నిండైన విగ్రహం ఆయనది.
నేను ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాడిని కనుక నా ప్రసంగం పారమార్థికంగానే సాగుతుంది. సంసార వృక్షానికి ఫలం మోక్షం అని, మోక్షం అంటే అమృ తం అని, అమృతం అంటే శాశ్వతమైన ఆనందమని, ఆ ఆనందం కేవలం వ్యాపా రం వల్ల, పిల్లలను కనడం వల్ల, ధన సం పాదన వల్ల లభించదని, ఒక్క త్యాగం వల్లనే అది సాధ్యమవుతుందని నేను ఆ సభలో మాట్లాడాను.
నా ప్రసంగం రామారావుగారిని ముగ్ధుణ్ణి చేసింది. ప్రసంగానంతరం వారు నన్ను అభినందిస్తూ నాతో “నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే వస్తారా” అని అడిగారు. ‘తప్పకుండా వ స్తానండి. మీరు ఏర్పాటు చేయండి’ అని సవినయంగా సమాధానమిచ్చాను. ఆ తర్వాత కొన్ని రోజులకు నాకు ఫోన్లో “మీ రు ఉపనిషత్తుల మీద ఒక వారం రోజులు మాట్లాడగలరా?” అని అడిగారు. అప్పటికి నేను ఉపనిషత్తుల మీద ఆరు సప్తాహాలు నిర్వహించాను.
మొదటి సప్తాహాన్ని త్యాగరాయ గానసభలో మహాకవి సి. నారాయ ణ రెడ్డి గారే ప్రారంభించారు. చెరుకూరి రామారావు గారి కోరిక మేరకు వనస్థలిపురంలోని ఆర్.ఎస్.ఎస్. మైదానంలోని ఒక భవనంలో వారం రోజులపాటు సాయం త్రం 6 నుంచి 8 దాకా నా ప్రసంగం కొనసాగింది. కాలనీ వాసులెంతోమంది వచ్చారు. రామారావు గారు సాయంత్రం 6 గంటలకు ముందే సభకు వచ్చి ఏర్పా ట్లు చూసుకునేవారు. నా ప్రసంగాలు కొనసాగడానికి గాను శిథిలమైన భవనాన్ని స్వయంగా ధనాన్ని వెచ్చించి మరమ్మత్తు చేయించారు. కొత్తగా చైర్లు కొనిపించారు. ప్రతిరోజు జరిగే నా ప్రసంగాన్ని వారు శ్రద్ధగా వినేవారు. చివర్లో నాల్గు మాటలు మాట్లాడేవారు.
అప్పటికే రామారావుగారు కొంత అస్వస్థులైనట్లు కనిపించేవారు. వేదికమీదికి రావాలంటే ఒకరి సహాయాన్ని కోరేవారు. అట్లా వారూ, నేను వేదిక మీద కూర్చున్న తర్వాత తప్పనిసరి జ్యోతిప్రకాశనం చేసేవారం.
మొదటిరోజు ప్రసంగం ఐన తర్వాత రామారావుగారు నా చెవిలో ఒకమాట చెప్పారు. ‘చెన్నప్పగారూ నేను సాధారణంగా ఏ సభకూ, సమావేశానికి వెళ్లడం లేదు. గంటల తరబడి కూర్చోలేను. ఎందుకో మీ మీద నాకు అభిమా నం. అందుకే నేను సగం గుండెతో మీ మాటలకు వస్తున్నాను’ అని అన్నారు. నాకు వారి మాటలు ఆశ్చర్యాన్ని కల్గించాయి. “ఔను నా గుండెకు స్టంట్లు పడ్డా యి. నేను జాగ్రత్తగా ఉన్నాను. మీ ప్రసం గం వింటానికీ ఇక్కడికి వస్తున్నాను. ఇంట్లో నన్ను రావద్దన్నా వస్తున్నాను” అని విషయాన్ని వివరించారు సూక్ష్మంగా.
అట్లా ఒక సప్తాహం ఉపనిషత్తుల మీద నిర్విఘ్నంగా జరిగింది. చివరిరోజు ఆహూతులకు అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు. మన కార్యక్రమాలకు ప్రారంభం ఎంతటి ప్రాముఖ్యం కల్గిందో, సమాపనం కూడా అంతటి ప్రాముఖ్యం కల్గింది కదా!
ఉపనిషత్తుల మీద విజయవంతంగా సప్తాహం ముగిసిన తర్వాత భగవద్గీత మీద ఒక సప్తాహం పెట్టించారు. అదే గ్రౌండులోని భవనంలో అంటే సా యంత్రం సమయంలో, నేను ఒక వారంరోజులు భగవద్గీతలోని జ్ఞానయోగం, కర్మ యోగం, భక్తియోగాల మీద మాట్లాడాను. వరిస్తే అది ‘వర్ణం’ అని, ధరిస్తే అది ‘ధర్మం’ అని, మానవ మాత్రుడెవ్వడైనా ఏ వర్ణాన్నైనా వరించవచ్చునని. అంతేకాదు ధర్మం తప్పరాదని, పరమేశ్వరునికి ఫలాలప్పచెప్పి సత్కర్శలు చేస్తే అది ‘కర్మయోగం’ అని, ప్రకృతి పురుష వివేకం కలిగి పరమేశ్వరున్ని ఉపాసిస్తే అది ‘జ్ఞానయోగం’ అని నేను చెప్పిన మాటలకు ఆహూతులెంతోమంది ఆకర్షితులయ్యారు.
2 సప్తాహాలను విజయవంతంగా ఏర్పాటు చేసిన రామారావుగారు నా చేత వేదాలమీద ఒక నలబై రోజులు (మండలం) ఉపన్యాసాలు ఏర్పా టు చేయాలనుకున్నారు. బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. తేదీలు ప్రకటించారు. సభావేదికను సిద్ధం చేశారు. కాని అస్వస్థత కారణంగా వారు ఆ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయారు. వారికి ఉపనిషత్తుల మీద, భగవద్గీతమీద, వేదాల మీద అపారమైన గౌరవం! మన సనాతన ధర్మం గురించి అందరికి తెలియజేయాలన్న నా తపనకు అనుగుణంగా రామారావుగారు వ్యవహరించడం నాకెంతో ఆనందాన్ని కల్గించింది.
రెండు సప్తాహాలకు వారు నాకు, అడగకుండానే పారితోషికాన్ని అం దించారు. అది నిజంగా ఎక్కడా అందుకోని పారితోషికం.
ధనవంతులైనప్పటికీ, త్యాగబుద్ధి కల్గిన రామారావుగారు ధార్మిక కార్యక్రమాలకు ఎంతో ధనాన్ని వెచ్చించేవారు. వ్యాపారాన్ని తన పిల్లలకు అప్పజె ప్పి ఒకవిధంగా విశ్రాంతి తీసుకోవలసిన రామారావుగారు “కుర్వన్నే లేహకర్మాణి జిజీవిషేత్ శతఃసమాః” అన్న వేదసూక్తికి అనుగుణంగా జీవించినంతకాలం ఫలాపేక్షలేని సత్కర్యాలే చేశారు.
ఒకరోజు రామారావుగారు “మనం పోచంపల్లికి పోదాం వస్తారా మాకార్లో” అన్నారు. నేను సరే అనగానే వారు స్వయంగా మా ఇంటికి వచ్చి పోచంపల్లికి సమీపంలోని తమ పళ్లతోటకు తీసుకొని వెళ్లారు. ఒక పెద్ద సంచినిండా సపోటా పళ్లు నింపి పంపించారు. తదాదిగా “ప్రతి సీజన్లో ప్రప్రథమంగా మీకే మా పళ్లు” అని అదే విధంగా పంపించే ఏర్పాటు చేశారు. రామారావుగారు మన మధ్య లేకపోయినా, వారి ధార్మిక హృద యం, త్యాగబుద్ధి గుర్తుకు వచ్చినప్పుడు నా మనస్సు ఆనందంతో పులకించిపోతుంది.
వ్యాసకర్త సెల్: 9885654381
ఆచార్య మసన చెన్నప్ప