బతుకు చిత్రం ‘కొలిమి’
దీపాల వెలుగు తెలిసినంతగా కమ్మరి కొలిమి(Kolimi ) వెలుగు సమాజానికి తెలియదు! బొగ్గులు నిప్పులై, నిప్పులు పనిముట్లై గొడ్డ లి, కొడవలి, పలుగు, పార, నాగలి కర్రులుగా రూపాంతరం చెంది వ్యవసాయా నికి, గ్రామీణ జీవితానికి సేవలందించాయి. నిత్యం యజ్ఞంలా మండే కొలిమి సమాజానికి అసలైన వెలుగు. కానీ, ఆ వెలుగును సృష్టించిన కమ్మరి బతుకే(Blacksmith Life) ప్రపంచీకరణలో చీకటిమయమైంది.
పండుగకు వెలిగించే దీపం కొద్దిసేపటికే ఆరిపోతుంది. కమ్మరి కొలిమిలోని నిప్పు మాత్రం తరతరాలుగా సమాజ జీవనాన్ని వెలిగిస్తూనే ఉంది. ఆ వెలుగును సృష్టించే కమ్మరి బతుకును గుర్తించేవారు ఎంతమంది? బీసీ కులవృత్తుల సాహిత్యం ఇప్పుడు తన అస్తిత్వ జెండాను ఎగురవేస్తున్నది. ఈ సా హిత్య పరంపరలో మహబూబాబాద్ జి ల్లాకు చెందిన కవి గన్నోజు ప్రసాద్ రచించిన ‘కొలిమి’ దీర్ఘకావ్యం ఒక విశిష్టమైన కృషి.
ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రసాద్‌కు కవిత్వం, విశ్లేషణ, విమర్శ ప్రవృత్తులు. ఆయన తండ్రి గన్నో జు రాజశేఖరం కమ్మరి వృత్తిలో నిపుణుడు. తండ్రి కొలిమిలోని అనుభవాలను, శ్రమను, నైపుణ్యాన్ని దగ్గరగా చూసిన ప్ర సాద్ ఆ జీవితాన్ని అక్షరాల్లోకి అనువదించారు. ‘తొలి పొద్దు, గాయమెరుగని సము ద్రం, శిలాక్షరం, వెన్నెల్లో చీకటి, జ్వలిత హృది’ వంటి కవితా సంపుటాలతో సాహి తీ ప్రయాణం సాగించిన ఆయన.. తొలిసారిగా తండ్రి వృత్తి జీవితాన్ని దీర్ఘకావ్యంగా మలిచారు. తండ్రి చేతుల బొబ్బలు, చెమట చుక్కలు, కొలిమి సెగలు ఈ కావ్యానికి జీవధాతువులయ్యాయి.
నిప్పుల నేత్రం కొలిమి
కావ్య ప్రారంభంలోనే కవి కొలిమి విశిష్టతను అద్భుతమైన ప్రతీకలతో ఆవి ష్కరిస్తారు. ‘నిప్పు కణికలో నిశ్శబ్ద జీవితంగా పొదిగి.. నిరాడంబరలో చెమట నదులను ఈదుతూ.. సమాజమనే శిలను చెక్కి, ఆచార సంప్రదాయ సంస్కృతులను సృ ష్టింపజేసి.. వేదన నేర్పిన సాధనలో.. నిలబడ్డ నిప్పుల నేత్రం కమ్మరి కొలిమి!’ అనేది కొలిమి అంతరార్థాన్ని చాటుతుంది.
కమ్మరి జీవితం నిప్పుతో సహజీవనం. నిప్పులో ఇనుమును కాలు స్తూ, సమ్మెట దెబ్బలతో పనిముట్లను మ లుస్తూ తన జీవితాన్ని నిశ్శబ్దంగా గడుపుతాడు. అతని ఒంటిపై నుంచి జారే చెమటే జీవననది. ఆ నదిని ఈదుతూనే సమాజ అవసరాలకు పనిముట్లను సృష్టిస్తాడు. సమాజమనే శిలను చెక్కడం అంటే కేవలం ఇనుముకు ఆకారం ఇవ్వడం కాదు. వ్యవసాయానికి, వృత్తులకు, గ్రామీణ నాగరిక తకు అవసరమైన పునాదులను నిర్మించడం. తన వేదననే సాధనగా మార్చుకున్న కమ్మరి కండ్లల్లో కనిపించే నిప్పు వ్యక్తిగత జీవితానిది మాత్రమే కాదు.. సమాజానికి వెలుగునిచ్చే ఉత్పత్తి శక్తిది.
వ్యవసాయానికి గుండెకాయ
కవి గ్రామీణ వ్యవసాయ జీవితాన్ని చిత్రించిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ‘తొలకరి జల్లు కురిసిందో లేదో కోకిల పాట అప్పుడే మొదలైనది.. ఎడబాసిన జంట ఒకటైనట్టు.. కొట్టాల కాడి నాగళ్ళు కాడెడ్లు లేకుండానే నడిసొచ్చి నిప్పుల కొలిమి దగ్గర బెల్లం చుట్టూ ఈగల్లా ము సురుకునేవి’...
ఈ వర్ణనలో పల్లె జీవితం కండ్లముందు కదలాడుతుంది. తొలకరి జల్లులు పడగానే రైతులో వ్యవసాయ ఆశ లు చిగురిస్తాయి. ఏడాది కాలంగా కొట్టాల్లో విశ్రాంతి తీసుకున్న నాగళ్లు, కాడెడ్లు మళ్లీ వ్యవసాయ పనులకు సిద్ధమవుతాయి. ఎడబాసిన జంట కలుసుకున్నట్టుగా నాగలి, కాడి, ఎడ్లు ఒక్కటవుతా యి. అయితే పొలం పనులు ప్రారంభం కావాలంటే నాగలికి కర్రు పదును కావాలి. గొర్రు సి ద్ధం కావాలి. అందుకే రైతులంతా కొలిమి బాట పడతారు.
ఆరిపోయిన కొలిమి
ట్రాక్టర్లు, ఆధునిక వ్యవసాయ యంత్రా లు, ఫ్యాక్టరీల్లో తయారయ్యే పనిముట్లు అందుబాటులోకి రావడంతో సంప్రదాయ కమ్మరి కొలిముల ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఊరికి అవసరమైన పనిముట్లన్నీ తయారుచేసిన కొలిములు నేడు మూతపడ్డాయి. వృత్తి వారసత్వంగా అందిన నైపుణ్యానికి తగిన ఉపాధి లేకుండా పోయింది. కమ్మరి తయారుచేసిన పనిముట్లతో రైతు అన్నం పండించాడు. ఆ అన్నం తిన్న సమాజం ఆ పనిముట్లను తయారుచేసిన చేతుల జీవితాన్ని విస్మరించింది. ఉత్పత్తి చేసినవారికి గుర్తింపు దక్కకపోవడం, వారి వృత్తికి గౌరవం తగ్గిపోవడం మన సామాజిక వ్యవస్థలోని వైరుధ్యం. ఈ మార్పుల వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక పరిణామాలను కవి తన వృత్తి అనుభవాల ద్వారా మన ముందుంచుతున్నారు.
అమ్మ చేతుల్లోనూ కొలిమి సెగలే!
ఈ దీర్ఘకావ్యంలో కవి అమ్మ శ్రమను ఆవిష్కరించిన తీరు ప్రత్యేకంగా హృదయాన్ని తాకుతుంది. ‘తిత్తి తిప్పిన అమ్మ చేతులు.. కొలిమి చిగురులను ఒడిగట్టుకుని దాచుకునేవి/చిల్లులు పడ్డ కోకలు.. అద్దకం వస్త్రాలై మెరిసేవి’ అని కవి ప్రస్తావిస్తాడు. ఇక్కడ అమ్మ చేతులు కేవ లం తిత్తి తిప్పే చేతులు కావు. అవి కుటుంబాన్ని నడిపించే శ్రమశక్తికి ప్రతీకలు. కొలిమిలో నిప్పును రాజేసే తిత్తి వెనుక అమ్మ శ్రమ ఉంది. తండ్రి సమ్మెట దెబ్బలకు తోడుగా అమ్మ చేతులు కూడా ఆ ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వాములయ్యా యి. చిల్లులు పడ్డ కోకలు అద్దకం వస్త్రాలై మెరిసేవనే భావన పేదరికపు జీవితంలోనూ అందాన్ని వెతుక్కునే అమ్మల జీవన సౌందర్యాన్ని గుర్తుచేస్తుంది.
ధిక్కారాలు
‘రక్తం కమిలిన చేతుల కలం నాది.. తాడితపీడిత జనం గుండెకు కొట్లాడే గొంతుక నేనే/ బహుజనవాదం బలోపేతానికి బలమైన సమరం నేనే చేస్తా.. మా కొలిమి నిప్పుల సాక్షిగా’ అంటాడు కవి ప్రసాద్.
ఇంతవరకు కొలిమి నిప్పు ఇనుమును కరిగించింది, ఇప్పుడు ఆ నిప్పే ఒక మనిషిని మేల్కొలిపింది! చేతిలో సుత్తి పట్టిన వాడు ఇప్పుడు చేతిలో కలం పట్టి, నా జాతి కోసం నేనే కొట్లాడతా అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు! ఇది కమ్మరి నుంచి కవి, కవి నుంచి యోధుడుగా మారిన ప్రయాణం. గన్నోజు ప్రసాద్ తన తండ్రి రాజశేఖరం వృత్తి జీవితాన్ని మాత్రమే రాయలేదు..
ఆ వృత్తి వెనుక ఉన్న తరతరాల నైపుణ్యాన్ని, కుటుంబ శ్రమను, గ్రామీణ వ్యవసాయ సంబంధాలను, ఉత్పత్తి సంస్కృతిని కావ్య వస్తువుగా స్వీకరించారు. కమ్మరి జీవితాల వెలుగును అక్షరాల్లో శాశ్వతం చేసిన గన్నోజు ప్రసాద్ ‘కొలిమి’ దీర్ఘకావ్యం వృత్తి అస్తిత్వ సాహిత్యంలో ఒక విలువైన చేరిక.
సెల్: 9492865358