తెలుగులో వస్తున్న ‘ఫూలే’
సామాజిక సంస్కరణల(Social reforms) చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే(Jyotirao Phule, Savitribai Phule). వారి జీవిత ప్రయాణం, వారి సామాజిక పోరాటం ఆధారంగా ‘ఫూలే’ చిత్రం తెరకెక్కింది. సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మిస్తోంది. డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.