నివాసాల మధ్య అక్రమ దందా!

23-11-2026 | 05:10am
  1. ఓల్డ్ బోయినపల్లి సిండికేట్ బ్యాంక్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యాపారం..
  2. అనుమతులు లేకుండానే పెంట్‌హౌస్‌లో కార్యకలాపాలు? 
  3. అగ్ని ప్రమాద భయంతో స్థానికులు బెంబేలు!

సికింద్రాబాద్, నవంబర్22 (విజయక్రాంతి): జననివాసాల మధ్య అక్రమ వ్యా పార కార్యకలాపాలు(Illegal business activities) స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓల్ బోయినపల్లి సిండికేట్ బ్యాంక్ కాలనీలోని ఓ బహుళ అంతస్తుల భవనం పెంట్హౌస్ లో ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రమాదకరమైన వ్యాపార కార్యకలాపాలు నిర్వహి స్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపు తున్నాయి.ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతుండటంతో కాలనీ వాసు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదకర వ్యాపారంతో ప్రాణాలకు ముప్పు?

జనావాసాల మధ్య ఇలాంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడంతో షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం జరగటంతో  ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శనివారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈఅగ్ని ప్రమాదంలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ,ఆస్తినష్టం కూడా యజమానులు స్పందించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న సంబంధిత పోలీసులకు గాని, ఫైర్ సిబ్బందికి గాని సమాచారం ఇవ్వకపోవడం తో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అధికారుల కళ్లుగప్పి కార్యకలాపాలా?

స్థానికుల ఆరోపణల ప్రకారం, సంబంధిత అధికారుల అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి ఈ వ్యవహారం తెలియకుండా కొందరు వ్యక్తులు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఓ పెద్దమనిషి తానే అన్నీ చూసుకుంటానంటూ వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నారని, మీడియాను సైతం మేనేజ్ చేశారనే ఆరోపణలను స్థానికులు చేస్తున్నారు.

ప్రమాదం జరిగినా పోలీసుల స్పందన ఏది?

ఇంతటి ప్రమాదకరమైన వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటికీ సంబంధిత పోలీసులు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టకపోవడం స్థానికుల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ వ్యాపారానికి ఎవరి అనుమతులు ఉన్నాయి? భవనం వినియోగానికి సంబంధించి నిబంధనలు పాటిస్తున్నారా? అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా? అధికారుల తనిఖీలు ఎందుకు జరగడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అధికారులు ఇప్పటికైనా మేల్కొంటారా?

జననివాసాల మధ్య ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వ్యాపారాలు నిర్వహిస్తే ఉపేక్షించకూడదని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సదరు భవనాన్ని తక్షణమే తనిఖీ చేసి, వ్యాపారానికి సంబంధించిన అనుమతులు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, భవన వినియోగ నిబంధనలను పరిశీలించాలని కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రత కంటే అక్రమ వ్యాపారాలే ముఖ్యమా? అధికారుల నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? ప్రమాదం జరిగిన తర్వాతే స్పందిస్తారా? లేక ముందుగానే చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు